టీమ్ కోసం చెఫ్ అవతారమెత్తిన హీరో!

టీమ్ కోసం చెఫ్ అవతారమెత్తిన హీరో!

Published on Nov 24, 2015 8:14 PM IST

nara-rohit
నారా రోహిత్.. విలక్షణ కథాంశాలను ఎంచుకుంటూ తెలుగు హీరోల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. ప్రస్తుతం తెలుగులో ఏ హీరో కూడా లేనంత బిజీగా నారా రోహిత్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సుమారు తొమ్మిది సినిమాలను లైన్లో పెట్టి వాటన్నింటినీ పకడ్బందీగా దేనికదే డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పండగలా వచ్చాడు, అప్పట్లో ఒకడుండేవాడు, సావిత్రి, తుంటరి సినిమాలను చివరిదశకు చేర్చడమే కాకుండా వీరుడు, కథలో రాజకుమారి, జ్యో అచ్యుతానంద, రాజా చెయ్యి వేస్తే సినిమాలని లైన్లో పెట్టారు.

ఇక ఈ సినిమాల్లో ఒకటైన ‘సావిత్రి’ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూట్ ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ డ్రామాను వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ సందర్భంగా మధ్యాహ్నం భోజనం కోసం నారా రోహిత్ స్వయంగా టీమ్ కోసం స్పెషల్ వంటకాలు చేస్తూ షూట్ మధ్యలో హీరో నుంచి చెఫ్ పాత్రలోకీ ప్రవేశిస్తూ సావిత్రి టీమ్‌కు కొత్త రుచులు పరిచయం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ఫేస్‌బుక్ ఎకౌంట్‌లో పంచుకుంటూ.. షూట్ మధ్యలో ఇలా వంటలతో సరదా సరదాగా ఉందని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు