గౌతమ్ మీనన్ అసిస్టెంట్ తో నారా రోహిత్ మూవీ

గౌతమ్ మీనన్ అసిస్టెంట్ తో నారా రోహిత్ మూవీ

Published on Dec 2, 2015 7:01 PM IST

nara-rohot-1
నందమూరి హీరోల ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు తెల్గు దేశం పార్టీ కార్యకర్తల సపోర్ట్ తో నారా వారి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన హీరో నారా రోహిత్. మొదటి సినిమా నుంచి వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ మరియు ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ వస్తున్న నారా రోహిత్ ఈ ఏడాది ‘అసుర’ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇప్పటికే తుంటరి అనే సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసిన నారా రోహిత్ ప్రస్తుతం సావిత్రి మరియు రాజ చేయ్యివేస్తే సినిమాల షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

ఇవి కాకుండా ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘పండగల వచ్చాడు’, ‘జో అచ్యుతానంద’, ‘వీరుడు’, ‘కథలో రాజకుమారి’ మరియు ప్రదీప్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి లైన్ పెట్టున్నాడు. ఇవి సరిపోవన్నట్టుగా నారా రోహిత్ మరో సినిమాకి సైన్ చేసాడు. సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిన గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన రమేష్ చెప్పిన కథ నారా రోహిత్ కి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. క్రైమ్ కామెడీ జానర్లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దీని ప్రకారం చూస్తుంటే వచ్చే ఏడాది నారా రోహిత్ ఓ అరడజను సినిమాలనే రిలీజ్ చేసేలా ఉన్నాడు.

తాజా వార్తలు