వరద బాధితులకు అండగా తెలుగు హీరోలు!

వరద బాధితులకు అండగా తెలుగు హీరోలు!

Published on Dec 2, 2015 8:51 PM IST

TFI
మన స్టార్ హీరోలు తెరపై మాత్రమే కాక, నిజ జీవితంలోనూ హీరోలే అని, మానవత్వంతో స్పందించే హృదయం తమ పాత్రలకే కాక తమకూ ఉందని మరోసారి ఋజువు చేశారు. చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తోన్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కురిసిన వర్షాలు చెన్నై నగరాన్ని అస్థవ్యస్థం చేసేశాయి. అక్కడి జనజీవనం పూర్తిగా స్థంబించిన నేపథ్యంలో వారికోసం ప్రభుత్వంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి.

ఇక ఈ సహాయ కార్యక్రమాలకు అండగా మేమున్నాం అంటూ తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలు తమ వంతు సహయం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ ఇలా మన హీరోలంతా తమ వంతుగా వరద బాధితులకు అండగా నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. చెన్నై నగరంతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకున్న ఈ స్టార్ హీరోలంతా తాము పెరిగిన ఊరిని ఇలా గుర్తించి సహాయ కార్యక్రమాలకు అండగా నిలబడడం మన హీరోల దాతృత్వం, మానవత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

చెన్నై బాధితుల సహాయార్థం తెలుగు హీరోలు ప్రకటించిన విరాళాల వివరాలు ఇలా ఉన్నాయి :

ఎన్టీఆర్ – 10 లక్షల రూపాయలు
కళ్యాణ్ రామ్ – 5 లక్షల రూపాయలు
మహేష్ – 10 లక్షల రూపాయలు
రవితేజ – 5 లక్షల రూపాయలు
వరుణ్ తేజ్ – 3 లక్షల రూపాయలు
సాయిధరమ్ తేజ్ – 3 లక్షల రూపాయల ఆహారం, వైద్య సదుపాయాలు
అల్లు అర్జున్ – 25 లక్షల రూపాయలు
సందీప్ కిషన్ – 5000 భోజనం ప్యాకెట్లు
సంపూర్ణేష్ బాబు – 50 వేల రూపాయలు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు