4k రిజల్యూషన్‌తో ‘బాహుబలి’ యూట్యూబ్‌కు వచ్చేసింది!

4k రిజల్యూషన్‌తో ‘బాహుబలి’ యూట్యూబ్‌కు వచ్చేసింది!

Published on Dec 3, 2015 12:37 AM IST

baahubali-b
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి ఇండియన్ సినిమాలో ఓ ప్రభంజనం సృష్టించిన ‘బాహుబలి’ సినిమాకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌కు ఓ సరికొత్త మార్గాన్ని సూచించిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో వ్యూస్ వర్షం కురిపించడానికి ఆన్‌లైన్లో పూర్తి సినిమాతో మనముందుకు రాబోతోంది. జూలై 10న విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మళయాలంలో టీవీల్లోనూ ప్రదర్శితమై అక్కడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక ఈ సాయంత్రం తెలుగు, తమిళ, మళయాల వర్షన్స్‌కు సంబంధించిన పూర్తి సినిమాను బాహుబలి టీమ్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ్4కే రిసల్యూషన్‌తో అల్ట్రా హెచ్‌డీ వర్షన్‌తో ఈ యూట్యూబ్ వర్షన్ విడుదలైంది. ఇండియాలో మొట్టమొదటి సారిగా 4కే రిజల్యూషన్‌తో యూట్యూబ్‌లో విడుదలైన సినిమాగా బాహుబలిని చెప్పుకోవచ్చు. 4కే రిజల్యూషన్‌‌తో చూడగల ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉన్నవారు ఆ అనుభూతిని పొందేందుకు బాహుబలి టీమ్ వీలు కల్పించింది. 150 రూపాయలకు బాహుబలి సినిమాను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి చూడవచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.

తాజా వార్తలు