రవితేజ కోసం బ్రహ్మికి అమలా పాల్ ట్యాగ్ లైన్

రవితేజ కోసం బ్రహ్మికి అమలా పాల్ ట్యాగ్ లైన్

Published on Dec 6, 2015 7:43 PM IST

bhrami
తెలుగు ప్రేక్షకులను గత 27ఏళ్ళుగా తెలుగు ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ పాన పాత్రలకు తగ్గట్టుగానే ఈయన పేర్లు కూడా చాలా కామెడీగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు దర్శకులు.. అదే బాటలోనే డైరెక్టర్ సంపత్ నంది కూడా తన తదుపరి సినిమా ‘బెంగాల్ టైగర్’లో బ్రహ్మానందం కోసం ఓ క్రేజీ పేరు పెట్టారు. అదే అమలా పాల్. ఇప్పటి వరకూ రకరకాల క్రేజీ పేర్లు పెట్టిన బ్రహ్మానందంకి సంపత్ నంది మొదటిసారి ఓ లేడీ స్టార్ పేరు పెట్టారు. బ్రహ్మానందంని ఈ పేరులో చూపించగానే ఎంతగా నవ్వు వస్తుందో అదే రేంజ్ లో తన పాత్ర కూడా నవ్విస్తుందని సంపత్ నంది అంటున్నారు.

అల్లాగే బెంగాల్ టైగర్లో రవితేజ – బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కూడా ఆడియన్స్ ని బాగా నవ్విస్తాయని సమాచారం. రవితేజ కిక్ 2 తర్వాత ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో నటించిన ఈ సినిమాలో అందాల భామలు తమన్నా, రాశీఖన్నాలు హీరోయిన్స్ గా నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున్ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. రాధా మోహన్ నిర్మించిన ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు