
ప్రశ్న) మీకు ఒకేసారి ఓ స్టార్ డైరెక్టర్ కథ చెప్పాడు, కొత్త డైరెక్టర్ చెప్పాడు. మీరు ఆఫర్ ఎవరికి ఇస్తారు?
స)నిఖిల్ – కచ్చితంగా కథ ఎవరిది బాగుంటే వారికే ఇస్తాను. స్టార్ డైరెక్టర్ కదా అని కమిట్ అవ్వను. ఒకవేళ ఇద్దరి కథలు సూపర్బ్ అయితే ఫస్ట్ ఆఫర్ స్టార్ డైరెక్టర్ కి ఇస్తాను ఎందుకంటే ఆయనకి అనుభవం ఎక్కువ కదా(నవ్వులు)..
ప్రశ్న) మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది.. మీకు ఛాన్స్ ఇస్తే ఏ యంగ్ హీరోని మల్టీ స్టారర్ సినిమా కోసం సెలక్ట్ చేసుకుంటారు?
స)నిఖిల్ – నేను రాజ్ తరుణ్ ని సెలక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే అతనితో నాకు మాంచి సాన్నిహిత్యం ఉంది.
ప్రశ్న) ఈయన డైరెక్షన్ లో ఒక్క సీన్ అన్నా చేయాలనుకునే తెలుగు డైరెక్టర్?
స)నిఖిల్ – ఇంకెవరండీ మన రాజమౌళి గారే.. ఆయన మన ఇండియన్ సినిమాని ఇంకో లెవల్ కి తీసుకెళ్ళే డైరెక్టర్.
ప్రశ్న) నవరసాల్లో మీకు బాగా ఇష్టమైంది, అలాగే ఇది నేను బెటర్ గా చేయగలను అనే ఎమోషన్ ఏది?
నిఖిల్ – నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అలాగే అన్నిటితో పోల్చుకుంటే కామెడీ చేయడమే చాలా కష్టం. నేను బెటర్ గా చేయగలిగేది కూడా కామెడీనే.. అలా అని సూపర్ గా చేస్తానని చెప్పుకోను. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి.
ప్రశ్న) యాక్టర్ అవ్వాలనుకునే వారిలో కచ్చితంగా ఉండాల్సిన మూడు క్వాలిటీస్ ఏమిటి?
స)నిఖిల్ – హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ సినిమా అంటే పిచ్చి ఉండాలి.
ప్రశ్న) ఒక ఫుల్ లెంగ్త్ పేరడీ సినిమాలో మీరో తెలుగు హీరోని ఇమిటేట్ చేస్తూ కనపడాలని చెప్పి ఓ హీరోని సెలక్ట్ చేసుకోమంటే ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు?
స)నిఖిల్ – ఇంకో ఆలోచనే లేదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారినే ఇమిటేట్ చేస్తాను. ఆయన సినిమాలు చూస్తూ, ఇమిటేట్ చేస్తూ పెరిగాను. అందుకే ఆయన్ని ఇమిటేట్ చేయడమే నాకు కాస్త ఈజీ.
ప్రశ్న) మీరు చేసిన సినిమాల్లో ఇది ఎందుకు చేసానురా బాబూ అనుకునే రెండు సినిమాలేవి?
స) నిఖిల్ – డిస్కో మరియు ఓం శాంతి.
ప్రశ్న) ఒక నటుడిగా మీకు మీరు మార్క్స్ వేసుకోవాలి అంటే 100కి ఎన్ని మార్క్స్ వేసుకుంటారు?
స) ఇప్పటికి నటుడిగా నేను జస్ట్ పాస్ అయ్యాను. అంటే 35 మార్కులు వేసుకుంటా.. ఓన్లీ కామెడీ పరంగా అంటే ఇంకో 10 మార్కులు కలుపుకుంటా.. మిగతా అన్నీ జస్ట్ పాస్ అంతే..

