
నాగ్ అశ్విన్.. ‘ఎవడే సుబ్రమణ్యం’ అనే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ప్రియాంక దత్.. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని నిర్మాతగా తెలుగులో తనదైన గుర్తింపు తెచ్చుకొని దూసుకెళుతోన్న యంగ్ ప్రొడ్యూసర్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎవడే సుబ్రమణ్యం’ అనే సినిమా ఇద్దరికీ మంచి హిట్ తెచ్చిపెట్టడమే కాకుండా ఒకరిని ఒకరికి దగ్గర కూడా చేసింది. ఇక ఆ ప్రేమ ప్రయాణాన్నే ఆదివారం నాటి పెళ్ళి వేడుకతో భ్యార్య భర్తల బంధంగా మార్చేశారు.
ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లో పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా పెళ్ళి జరగ్గా, నిన్న భారీ ఎత్తున రిసెప్షన్ వేడుక నిర్వహించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల నుంచి ప్రముఖులు హాజరైన ఈ వేడుకను అశ్వినీ దత్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహేష్ -నమ్రత, కృష్ణ -విజయ నిర్మల, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్ – స్నేహ ఇలా పలువురు స్టార్ దంపతులు ఈ వేడుకకు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక ఇదే వేడుకకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు, రాఘవేంద్ర రావు, అల్లు అరవింద్‌లు కూడా విచ్చేశారు.
ఈ వేడుకకు సంబంధించిన ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

