‘లోల్’ రిలీజ్ డేట్ మారింది..!

‘లోల్’ రిలీజ్ డేట్ మారింది..!

Published on Dec 9, 2015 5:14 PM IST

lol
‘అందాల రాక్షసి’ సినిమాతో సూపర్ క్రేజీ జంటగా మారిపోయిన నవీన్ చంద్ర – లావణ్య త్రిపాఠిలు మరోసారి ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అన్న సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. షార్ట్‌కట్‌లో ‘లోల్’ అన్న టైటిల్‌తో ఈ సినిమా ప్రచారం పొందుతోంది. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్‌తో పాటు అన్ని ఇతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. కాగా ఈ సీజన్‌లో వరుసగా పెద్ద సినిమాలు వచ్చి పడడంతో సినిమాకు సరైన రిలీజ్ డేట్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూశారు.

ఆ నేపథ్యంలోనే డిసెంబర్ 11న ఈ సినిమాను విడుదల చేయాలని భావించినా, తాజాగా జనవరి 1ని రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఈ నెల్లో వరుసగా ఇతర సినిమాలు లైన్లో ఉండడంతో జనవరి 1ని రిలీజ్‌కు సరైన సమయంగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. రాజమౌళి స్వయంగా ఈ సినిమా ఆడియో రిలీజ్‌కు హాజరవ్వడంతో లోల్ సినిమాపై మంచి ఆసక్తి చెలరేగింది. ఇక కీరవాణి అందించిన మ్యూజిక్, ట్రైలర్ కూడా ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చింది. సాయి ప్రసాద్ కామినేని ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు.

తాజా వార్తలు