ఆకట్టుకుంటోన్న ‘బెంగాల్ టైగర్’ భారీ ప్రమోషన్స్!

ఆకట్టుకుంటోన్న ‘బెంగాల్ టైగర్’ భారీ ప్రమోషన్స్!

Published on Dec 9, 2015 9:48 PM IST

bengal-tiger
మాస్ మహరాజ్ రవి తేజ ‘బెంగాల్ టైగర్’గా అలరించేందుకు సిద్ధమైపోయారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు(డిసెంబర్ 10న) పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమైంది. రవితేజ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌కు కూడా మంచి ప్రాధాన్యతనిచ్చినట్లు చెప్పబడుతోన్న ఈ సినిమా అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని హీరో రవి తేజ, దర్శకుడు సంపత్ నంది వ్యక్తం చేశారు.

ఇక రిలీజ్‌కు వారం ముందు నుంచే ప్రచార కార్యక్రమాల్లో జోరు చూపించిన ఈ సినిమా యూనిట్ రిలీజ్ రోజు దగ్గరైపోవడంతో ప్రచారాలను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే హీరో రవితేజ, హీరోయిన్లు తమన్నా, రాశిఖన్నా, దర్శకుడు సంపత్ నంది ఇలా అందరూ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ సందర్భంగా తమన్నా, రాశి ఖన్నాల సందడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినిమాలోనూ వీరిద్దరి గ్లామర్ సినిమాకు ఓ స్పెషల్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. కె.కె.రాధామోహన్ ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు.

తాజా వార్తలు