
ఈ ఏడాది ‘బాహుబలి’ అనే సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మరో మూడు రోజుల్లో బాహుబలి పార్ట్ 2 సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు కానుంది. ఈ సినిమా షూటింగ్ 7-8 నెలల పాటు కంటిన్యూగా జరగనుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది అంతా ఎక్కువ భాగం ప్రభాస్ ఈ సినిమాపైనే దృష్టి పెట్టనున్నాడు. ఈ సినిమాని కాసేపు పక్కన పెడితే.. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఇప్పటికే రన్ రాజా రన్ ఫేం సుజీత్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సుజీత్ కూడా కథని సిద్దం చేస్తున్నాడు.
ఇది కాకుండా రీసెంట్ గా ప్రభాస్ మరో యంగ్ డైరెక్టర్ చెప్పిన స్టొరీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ ఏడాది జిల్ సినిమాతో దర్శకుడిగా మారిన రాధాకృష్ణ ఇటీవలే ప్రభాస్ ని కలిసి ఓ సినిమా స్త్రోయ్ లైన్ చెప్పాడట. అది ప్రభాస్ కి నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేయమని చెప్పాడట. రాధాకృష్ణ పర్ఫెక్ట్ గా కథని సిద్దం చేస్తే ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేస్తాడు. ఇటీవలే రాధాకృష్ణ రామ్ చరణ్ తో సినిమా చేయాలనీ అనుకున్నా అది వర్కౌట్ కాకపోవడంతో ప్రభాస్ కోసం కథని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. మరి ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

