
సూపర్ స్టార్ రజనీ కాంత్, ప్రఖ్యాత దర్శకుడు శంకర్ల కాంబినేషన్లో రూపొంది ప్రభంజనం సృష్టించిన ‘రోబో’ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు దర్శకుడు శంకర్ పకడ్బందీగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. రజనీ కాంత్ పుట్టినరోజైన డిసెంబర్ 12న ఈ సినిమాను గ్రాండ్‌గా లాం చేయాలని ఎప్పట్నుంచో ప్లాన్ చేసుకున్న విషయం తెలిందే.
కాగా చెన్నై నగరాన్ని గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో సినిమా లాంచ్ ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా రజనీ కాంత్ పుట్టినరోజునే నిరాడంబరంగా ‘రోబో 2’ సినిమాను లాంచ్ చేయనున్నట్లు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. డిసెంబర్ 16నుంచి చెన్నై శివార్లలో ఈ సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్స్‌లో షూటింగ్ జరగనుంది. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటించనున్న ఈ సినిమాలో రజనీ కాంత్‌కు విలన్‌గా ఓ ఇంటర్నేషనల్ నటుడిని ఎంపిక చేసే పనిలో శంకర్ ఉన్నారు.

