వర్మ కొత్త సినిమాలో కేవలం విలన్‌కే లవ్‌స్టోరీ !

వర్మ కొత్త సినిమాలో కేవలం విలన్‌కే లవ్‌స్టోరీ !

Published on Dec 28, 2015 5:49 PM IST

Killing-Virapan
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. దక్షిణ భారతదేశంలోని రెండు రాష్ట్రాల పోలీసులను వణికించిన స్మగ్లర్ వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్ కథతో రూపొందిన సినిమా కావడంతో కిల్లింగ్ వీరప్పన్‌పై మొదట్నుంచే విపరీతమైన క్రేజ్ కనిపిస్తూ వచ్చింది. వీరప్పన్‌ను చంపిన పోలీసాఫీసర్‌గా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించడం కూడా ఈ సినిమాకు ఓ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

ఇక ట్రైలర్, పోస్టర్స్‌తో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా రిలీజ్‌ దాకా వచ్చి పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా చివరకు జనవరి 1కి ఫిక్స్ అయిపోయింది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజులే ఉండడంతో వర్మ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే సినిమా విశేషాలు పంచుకుంటూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో హీరో శివ రాజ్ కుమార్ క్యారెక్టర్‌కు లవ్‍స్టోరీ ఉండదని, అదే విలన్ తరహా పాత్రైన వీరప్పన్‌ పాత్రకు ఓ లవ్‌స్టోరీ ఉంటుందని తెలిపారు. వీరప్పన లవ్‌స్టోరీ తాను తన లైఫ్‌లో విన్న అతిచిన్న ప్రేమకథ అని వర్మ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు