బాలయ్య ‘డిక్టేటర్’ సెన్సార్ కి స్పెషల్ ముహూర్తం

బాలయ్య ‘డిక్టేటర్’ సెన్సార్ కి స్పెషల్ ముహూర్తం

Published on Jan 5, 2016 5:43 PM IST

dictatoot
నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డిక్టేటర్’. రెండు రోజుల క్రితమే షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసారు. అలాగే నేటితో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కి కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఈ రోజు సాయంత్రం కల్లా ఫస్ట్ కాపీని కూడా సిద్దం చేసేయనున్నారు. ఆడియో మరియు మూవీ రిలీజ్ విషయంలో స్పెషల్ ముహూర్తాన్ని పాటించే బాలకృష్ణ.. డిక్టేటర్ సెన్సార్ కి కూడా ఓ మూహూర్తం ని ఫిక్స్ చేసాడు.

డిక్టేటర్ టీం అనౌన్స్ చేసిన దాని ప్రకారం రేపు అనగా జనవరి 6వ తేదీ ఉదయం 9:36 నిమిషాలకు సెన్సార్ వారు ఈ సినిమాని చూడనున్నారు. అనగా రేపు మధ్యాహ్నం కల్లా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ విశేషాలు తెలిసిపోతాయి. ఈ చిత్ర టీం అయితే ‘యు/ఏ’ వస్తుందని ఆశిస్తున్నారు. బాలకృష్ణని స్టైలిష్ గా చూపిస్తూ, కామెడీ కూడా సమపాళ్ళలో ఉండేలా చేసిన ఈ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఇకపోతే డిక్టేటర్ బాలకృష్ణ 99వ సినిమా కావడం వలన కోన వెంకట్ – గోపి మోహన్ లు స్పెషల్ కేర్ తీసుకొని ఈ సినిమా కథని రెడీ చేసారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు