ఊహకందని రికార్డుల్ని సృష్టిస్తున్న ‘బాహుబలి-2’ !

ఊహకందని రికార్డుల్ని సృష్టిస్తున్న ‘బాహుబలి-2’ !

Published on Mar 24, 2017 10:35 AM IST


‘బాహుబలి – ది కంక్లూజన్’ థియేట్రికల్ ట్రైలర్ అద్భుతాలు సృష్టిస్తోంది. ఊహకందని రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం సాధించలేని ఘనతల్ని మూటగట్టుకుంటోంది. మార్చి 16వ తేదీ ఉదయం 9 గంటల సమయంలో విడుదలైన ఈ ట్రైలర్ 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇన్నాళ్లు ఇలాంటి ఒక సంఖ్య సాధ్యమేనని కూడా చాలా మంది ఊహకంది ఉండదు. విడుదలైన అన్ని భాషల్లోనూ కలిపి ఈ వ్యూస్ దక్కాయి.

ఒక్క రోజులోనే సుమారు 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆయాధికా లైక్స్ పొందిన భారతీయ చిత్ర ట్రైలర్ గా కూడా ఘనత సాధించింది. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతం యొక్క ఆడియో వేడుక మార్చి 26న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ మాహిష్మతి సామ్రాజ్య సెట్టింగ్స్ మధ్య జరగనుంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ఇకపోతే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు