రేపు భారీగా ‘టచ్ చేసి చూడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

రేపు భారీగా ‘టచ్ చేసి చూడు’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

Published on Jan 26, 2018 3:47 PM IST

రవితేజ ఇటీవల చేసిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన ‘టచ్ చేసి చూడు’ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శీరత్ కపూర్ మరో హీరోయిన్ గా నటించింది.

రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. రవితేజ అభిమానులు భారీగా పాల్గొనబోయే ఈ వేడుకకు చాలా మంది సినీ నటులు హాజరుకాబోతున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే ప్రీతమ్ అందించిన పాటలు పాపులర్ అయ్యాయి. ఈ సినిమా తరువాత రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకతంలో ‘నేల టికెట్’ సినిమాలో నటిస్తున్నాడు.

తాజా వార్తలు