మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసిన నారా రోహిత్ !

మరో కొత్త ప్రాజెక్టుకు సైన్ చేసిన నారా రోహిత్ !

Published on Jan 28, 2018 4:17 PM IST

యంగ్ హీరో నారా రోహిత్ ఎప్పుడూ చేతి నిండా సినిమాలతో బిజీగానే ఉంటారు. ఏడాదికి ఆయన సినిమాలు కనీసం రెండు విడుదలవుతుండగా సెట్స్ మీద ఏదో ఒక సినిమా ఉంటూనే వస్తుంది. ప్రస్తుతం జగపతిబాబుతి కలిసి ‘ఆటగాళ్లు’ అనే సినిమా చేస్తున్న ఆయన ఈ మధ్యే తేజ, సీనియర్ హీరో వెంకటేష్ ల సినిమాలో ఒక కీ రోల్ కు ఫైనలయ్యారు.

ఇది కాకుండా ఇప్పుడు మరొక సినిమాకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. నూతన దర్శకుడు ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వంలో ఈ సినిమా ఉండనుంది. ఈఎంవిఈ స్టూడియోస్ నిర్మించనున్న ఈ చిత్రం మార్చి నుండి మొదలుకానుంది. ఈ చిత్రంలో ఇతర నటీనటులెవరు, సాంకేతిక నిపుణులెవరు అనే విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

తాజా వార్తలు