డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరితో చేస్తున్న చిత్రం ‘మెహబూబా’. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు ప్రేక్షకుల నుండి బ్రహ్మాండమైన స్పందన లభించింది. చాలా రోజుల తరవాత పూరి నుండి కొత్త తరహా సినిమా వస్తోందనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడిపోయింది.
1971 ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాను ఈ వేసవికి భారీ ఎత్తున విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో ఆకాష్ పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా సందీప్ చౌత సంగీతాన్ని అందిస్తున్నారు. సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని పూరి స్వయంగా నిర్మిస్తున్నారు.


