రాజకీయ నేపధ్యంలో రంగస్థలం ?

రాజకీయ నేపధ్యంలో రంగస్థలం ?

Published on Feb 16, 2018 5:00 PM IST


చరణ్ నటిస్తోన్న రంగస్థలం సినిమాలోని మొదటిపాట విడుదలై పాపులర్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సీత పాత్రలో సమంత అలరించబోతోందని సమాచారం. మర్చి 30 న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది. చరణ్ లోని కామిక్ యాంగిల్ ఈ మూవీలో బాగా వర్కౌట్ అయ్యిందని తెలుస్తోంది. ఈ చిత్రంలో అన్ని పాత్రలు సహజంగా ఉండబోతున్నట్లు సమాచారం.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. లోకల్ పాటిటిక్స్ ఈ మొవీలో ఉన్నాయంట. సర్పంచ్ ఎన్నికల సన్నివేశాలు ఈ సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అనసూయ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి చరణ్ అన్న పాత్రలో కనిపించబోటున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు