నాని నెక్స్ట్ సినిమా ఎవరితో?

నాని నెక్స్ట్ సినిమా ఎవరితో?

Published on Feb 28, 2018 7:40 PM IST

నాని ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటిస్త్తున్నాడు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హిప్ హాప్ తమిజ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మాస్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తరువాత నాని నటించబోయే సినిమా ఏంటి అనే దానిపై స్పష్టత లేదు.

విక్రంమ్ కుమార్ దర్శకత్వంలో మంజుల నిర్మాణంలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అలాగే కిషోర్ తిరుమల తో సినిమా ఉంటుందని అనౌన్స్చేసారు కాని ఆ ప్రాజెక్ట్ లో సాయి ధరమ్తేజ్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాను నిర్మిస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ లో సాయి కొర్రపాటి నానితో సినిమా నిర్మించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కుడా అధికార ప్రకటన లేదు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు