బెల్లంకొండ సినిమాలో నటించనున్న తమిళ హీరో !

బెల్లంకొండ సినిమాలో నటించనున్న తమిళ హీరో !

Published on Mar 7, 2018 6:26 PM IST

వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తోన్న సినిమా ఇటీవల ప్రారంభం అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి పరిచయం కానున్నారు. కాజల్ ఈ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ లో మరో హీరొయిన్ కూడ నటిస్తోంది. త్వరలోనే ఆ వివరాలు తెలియనున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో తమిళ హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ ఈ సినిమాలో ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించబోతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ సినిమా మే 18 న విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీ వాసు దర్శకత్వం వహించారు.

తాజా వార్తలు