విజయ్ దేవరకొండ ఫస్ట్ స్టేట్ మెంట్ ఏం ఇవ్వబోతున్నాడు ?

విజయ్ దేవరకొండ ఫస్ట్ స్టేట్ మెంట్ ఏం ఇవ్వబోతున్నాడు ?

Published on Mar 7, 2018 8:05 PM IST

విజయ్ దేవరకొండ తమిళ డైరెక్టర్ ఆనంద్ శంకర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో జరిగాయి. మెహరిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది.

రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమాకు సంభందించి ఒక అధికారిక ప్రకటన రానుంది. ఫస్ట్ స్టేట్మెంట్ పేరుతో ఈ న్యూస్ బయటకు రానుంది. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల, లేదా సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. తెలుగు తమిళ్ లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన ‘ఏ మంత్రం వేశావే’ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది.

తాజా వార్తలు