నెల గ్యాప్ తో రెండు సినిమాలతో వస్తున్న హీరో !

నెల గ్యాప్ తో రెండు సినిమాలతో వస్తున్న హీరో !

Published on Mar 8, 2018 1:00 PM IST

ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తోన్న సినిమా ‘ఎం.ఎల్.ఏ’. విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ సాంగ్ షూటింగ్ ఫారిన్లో జరుగుతోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా మార్చి 23 న విడుదల కానుంది.

ఈ సినిమా విడుదలైన తరువాతి నెలలో కళ్యాణ్ రామ్ నటించిన మరో సినిమా ‘నా నువ్వే’ విడుదల కాబోతుండడం విశేషం. మే 25 న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చెయ్యనుంది. జయేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పి.సి శ్రీరాం సినిమాటోగ్రఫి అందించగా తమన్నా హీరోయిన్ గా నటించింది. లవ్ స్టోరి గా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాల తరువాత పవన్ సాదినేని డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు