అఖిల్ మూడో సినిమాకు సంభందించి మరో కొత్త వార్తా బయటికి వచ్చింది. తొలిప్రేమ సినిమాతో మంచి విజయం సాధించిన వెంకి అట్లూరి అఖిల్ తో సినిమా చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడట. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలుబడేవరుకు ఆగాల్సిందే.
హలో సినిమా తరువాత అఖిల్ చాలా కథలు వినడం జరిగింది. కొరటాల శివతో అఖిల్ సినిమా ఉంటుంది అన్నారు కాని అది జరగలేదు అలాగే ఆది పినిశెట్టి అన్న దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి అది కూడా స్టార్ట్ అవ్వలేదు. ఆఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరుకు ఈ వార్తను నమ్మలేము. త్వరలోనే అఖిల్ సినిమాను నాగార్జున ప్రకటిస్తాడని సమాచారం.


