ఆ సినిమాలో కామెడి ప్రధానంగా ఉంటుందట !

ఆ సినిమాలో కామెడి ప్రధానంగా ఉంటుందట !

Published on Mar 27, 2018 9:59 PM IST

నాని ”కృష్ణార్జున యుద్ధం” పాటలకు మంచి స్పందన లభిస్తోంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్‌ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కామెడి బాగా వచ్చిందని సమాచారం. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో చిత్తూరు అబ్బాయిగా నాని పాత్ర ప్రేక్షకులను నవ్వించబోతోందని సమాచారం.

ఈ నెల 31న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ తిరుపతిలో చెయ్యబోతున్నారు. సినిమా తిరుపతి, చిత్తూరు నేపద్యంలో నడిచే కథ కావున తిరుపతిలో ఫంక్షన్ చెయ్యబోతున్నారు. హిప్ హప్ తమిజ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఏప్రిల్ 12న ఈ సినిమను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు