కళ్యాణ్ రామ్, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘నా నువ్వే’. తమిళ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్ బ్రీజీ సినిమా బ్యానర్ పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. తాజా సమాచారం మేరకు కమెడియన్ బిత్తిరి సత్తి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో నటించిన బిత్తిరిసత్తి ఈ సినిమాలో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల అయ్యింది. రేడియో జాకిగా తమన్నా నటిస్తోన్న ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరి గా రుపొందించబడుతోంది. మే 25 న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


