సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న సినిమా ‘సైరా’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. నయనతారా, అమితాబ్ బచ్చన్ చిత్ర షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. తాజాగా చిత్ర షూటింగ్ స్టిల్స్ ను అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం జరిగింది. బయటికొచ్చిన కొద్దిసేపటికే ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. అందరూ నరసింహారెడ్డి గెటప్లో ఉన్న చిరంజీవి లుక్ చాలా బాగుందని అంటున్నారు.
అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో చిరంజీవి గురువు పాత్రలో నటిస్తున్నాడు. రెండు రోజుల క్రితమే అమితాబ్ తన లుక్ ను కూడ బయటికి వదిలారు. రత్నవేలు సినిమాటోగ్రఫి అనిస్తోన్న ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు రాస్తున్నారు. విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి నటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


