తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న దర్శకుడు !

తనకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్న దర్శకుడు !

Published on Apr 3, 2018 5:01 PM IST

గత రెండు రోజులుగా శేఖర్ కమ్ములపై ఒక వార్తా హాల్చల్ చేస్తోంది. నటి శ్రీ రెడ్డి ఇన్డైరెక్ట్ గా శేఖర్ కమ్ములపై కామెంట్స్ చేసారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సందర్భంలో తాజాగా శేఖర్ కమ్ముల స్పందించడం జరిగింది. ఫేస్ బుక్ లో తన గురించి వచ్చిన ప్రతీ మాట అబద్ధం, అసభ్యం. అవమానకరమని శేఖర్ కమ్ముల కొట్టిపడేసాడు.

సోషల్ మీడియాలో తన గురించి అలాంటి వ్రాతలు తన కుటుంభానికి భాధ కలిగించిందని శేఖర్ కమ్ముల అన్నారు. శ్రీ రెడ్డి ని తను ఎప్పుడు కలవలేదని, ఫోన్ లో కూడా మాట్లాడలేదని ఈ డైరెక్టర్ చెబుతున్నాడు. తనపై ఇలా ప్రచారం జరగడం తనకు షాక్ కలిగించిందని, స్త్రీల సమానత్వం, సాధికారతలని తను ఎంత నమ్ముతానో తన సినిమాలు చెబుతాయని ఈ డైరెక్టర్ అంటున్నాడు. శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ అంతా అబద్దమని అందుకు శ్రీ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని శేఖర్ కమ్ముల డిమాండ్ చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు