1998 అక్టోబర్ 2న ‘హమ్ సాత్ సాత్ హై’ షూటింగ్ సమయంలో జోధ్ పూర్ కు దగ్గర్లోని కంకాని గ్రామం వద్ద రెండు క్రిష్ణ జింకల్ని వేటాడి చంపిన కేసులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు జోధ్ పూర్ కోర్టు 20 ఏళ్ల విచారణ అనంతరం తుది తీర్పును వెల్లడించింది.
కేసును పోర్టిస్టహాయిలో విచారించిన న్యాయస్థానం సెక్షన్ 51 వన్య ప్రాణ సంరక్షణ చట్టం కింద 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 10,000ల జరిమానాను విధించింది. ఇక ఈ కేసులో ఆయనతో పాటు అనుమానితులుగా ఉన్న సైఫ్ అలీఖాన్, సొనాలి బింద్రే, నీలమ్ వంటి ఇతర నటీనటులను సరైన సాక్ష్యాధారాలు లేనందున నిర్దోషులుగా తేల్చింది కోర్టు.


