‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ ?

‘రౌడీ జనార్దన’ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ ?

Published on Apr 22, 2026 2:00 PM IST

Rowdy-Janardhana

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్‌ కోలా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌడీ జనార్దన’. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. మే ఎండింగ్ లో రవి కిరణ్‌ కోలా, కొత్త షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడట. రామోజీ ఫిల్మ్ సిటీలో విజయ్ దేవరకొండ పై సాంగ్ ను షూట్ చేయనున్నారని, అనంతరం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అనుకుంటున్నారు. మరి ఈ సాంగ్ లో ఏ హీరోయిన్ కనిపిస్తోందో చూడాలి.

కాగా ఈ సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తాడట. పైగా విజయ్ దేవరకొండ యాక్షన్ సీన్స్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటాయట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నట్టు రాజశేఖర్ పాత్ర అండ్ ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. కాగా ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్‌ నటించనుంది. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు