భారీ ప్రమోషన్లు ప్లాన్ చేసిన ‘మెహబూబా’ టీమ్ !

భారీ ప్రమోషన్లు ప్లాన్ చేసిన ‘మెహబూబా’ టీమ్ !

Published on May 5, 2018 11:57 AM IST

Mehabooba1

ఈ నెలలో విడుదలకానున్న చిత్రాల్లో ‘మెహబూబా’ కూడ ఒకటి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా కనిపించనున్నాడు. మే 11న ఈ చిత్రం పట్ల టీమ్ అంత ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందుకే టీమ్ అందరూ కలిసి ఓవర్సీస్లో భారీ టూర్ ప్లాన్ చేసి ప్రమోషన్లు చేపట్టనున్నారు.

మే 10న వేయనున్న ప్రీమియర్ షోల నుండి మే 24 వరకు లాస్ ఏంజిల్స్, న్యూ జెర్సీ, మిల్పిటాస్, సాన్ జోస్, కారి వంటి పలు ప్రాంతాల్లో అభిమానుల్ని కలవనున్నారు టీమ్ సభ్యులు. నిన్ననే సెన్సార్ పూర్తిచేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఇండియా, పాకిస్థాన్ యుద్ధ నైపథ్యంలో నడిచే ప్రేమ కథగా ఉండనుంది. ఇందులో ఆకాష్ పూరికి జోడీగా నేహా శెట్టి కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు