సైరా షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబ్ !

సైరా షూటింగ్ లో పాల్గొంటున్న అమితాబ్ !

Published on Jun 8, 2018 10:41 PM IST

స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం’ సైరా నర్సింహారెడ్డి’ . మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నయన తార కథనాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది నిన్న ప్రారంభమైన ఈ లాంగ్ షెడ్యూల్ లో బిగ్ బి ‘అమితాబ్ బచ్చన్’ పాల్గొంటున్నారు.

ఈ చిత్రంలో అమితాబ్ నర్సింహారెడ్డి గురువు పాత్రలో నటిస్తున్నారు . తాజా షెడ్యూల్ లో ఈయన ఫై ముఖ్య సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. రెండు నెలల విరామం అనంతరం అమితాబ్ తిరిగి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.

40 రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్లో సినిమాకు కీలకం కానున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు