రజినీతో ఆ బయోపిక్ తెరకెక్కించాలనుకున్నాను- శంకర్ !

రజినీతో ఆ బయోపిక్ తెరకెక్కించాలనుకున్నాను- శంకర్ !

Published on Jun 12, 2018 5:00 PM IST

Shankar
తమిళనాడుకు చెందిన సామజిక వేత్త రామస్వామి నిజ జీవితం ఆధారంగా ‘ట్రాఫిక్ రామస్వామి’అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈయన తమిళ నాడు ట్రాఫిక్ సమస్యలఫై తీవ్ర స్థాయిలో పోరాడారు. అందుకే ఈయనని ట్రాఫిక్ రామస్వామి అంటారు. ఈ చిత్రంలో, తమిళ స్టార్ ఇళయ దళపతి విజయ్ తండ్రి, ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ ఏ చంద్ర శేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక నిన్న రాత్రి చెన్నైలో జరిగింది .

ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు శంకర్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ రామస్వామి చేసిన సేవల గురించి పేపర్లో చదివి షాకయ్యేవాడిని. అయన తమిళనాడుకు ఎంతో సేవ చేశారు. అయన జీవిత కథతో సినిమాను తీయాలనుకున్నాను, ఆ కథకు రజినీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నాను. ‘2 పాయింట్ 0’ సినిమా తరువాత రామస్వామి కథ గురించి రజినీతో చర్చించాలనుకున్నా ఇంతలో అయన మీద వేరే వాళ్ళు సినిమా తీస్తున్నారని తెలుసుకొని చాలా నిరాశ చెందాను . తరువాత తెలిసింది ఈ సినిమాను తీస్తుంది ఎవరో కాదు ఎస్ ఏ చంద్ర శేఖర అని అప్పుడు చాలా సంతోషపడ్డాను . ఎందుకంటే సమాజంపట్ల అయన ఎంత హుందాగా ప్రవర్తిస్తారో నాకు తెలుసు రామస్వామి పాత్రలో అయన ఒదిగిపోతారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు