‘తేజ్ ఐ లవ్ యు’ తో తేజ్ గట్టెక్కుతాడా ?

‘తేజ్ ఐ లవ్ యు’ తో తేజ్ గట్టెక్కుతాడా ?

Published on Jun 13, 2018 8:20 PM IST


గత కొంత కాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్నాడు యువ హీరో సాయి ధరమ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సుప్రీమ్ సినిమా తో తన మార్కెట్ ను 25కోట్ల దాక పెంచుకున్న ఈ హీరో ఆ తరువాత చేసిన సినిమాలు వరుసగా పరాజయాలు చెందడంతో ఆ మార్కెట్ ను నిలబెట్టుకోలేకపోయాడు.

ఇక ఇప్పుడు ప్రేమ కథ చిత్రాల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ధరమ్ తేజ్ ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంలో నటించాడు. ఇటీవల ఈ చిత్ర ఆడియో రిలీజ్ మెగాస్టార్ చిరంజీవి గారి సమక్షంలో మీదుగా గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రం జూన్ 29 విడుదలవాల్సి ఉండగా ఇది కాస్త వాయిదా పడి వచ్చే నెల 6న రిలీజ్ అవ్వనుంది. మరి ఎలాగైనా ఈ సినిమా తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నా తేజ్ ఆశలు ఈ సినిమాతో తీరుతాయో లేదో చూడాలి. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై కే ఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు