ప్రముఖ నిర్మాత కుమారుడు ఈసారైనా సక్సెస్ చూస్తాడా ?

ప్రముఖ నిర్మాత కుమారుడు ఈసారైనా సక్సెస్ చూస్తాడా ?

Published on Jun 21, 2018 1:24 PM IST

ప్రముఖ న్రిమాట ఎం.ఎస్.రాజు కుమారుడు సుమంత్ అశ్విన్ 2012లో ‘తూనీగా తూనీగా’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభమలో ‘అంతకుముందు ఆ తర్వాత, కేరింత, కొలంబస్’ వంటి సినిమాలతో పర్వాలేదనిపించుకున్న ఆయన ఆ తరవాత చేసిన ‘రైర్ రైట్, ఫ్యాషన్ డిజైనర్ సొన్ ఆఫ్ లేడీస్ టైలర్’ వంటివి భారీ పరాజయాలుగా మిగలడంతో కెరీర్లో బాగా వెనుకబడ్డారు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’. మెగా డాటర్ నిహారిక కొణిదెల కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపైనే అశ్విన్ ఆశలన్నీ. కొద్దిసేపటి క్రితమే చిత్ర టీజర్ విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మరి ఈ సినిమాతోనైనా ఆయన సక్సెస్ చూస్తారో లేదో చూడాలి. పాకెట్ సినిమాస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు