కంటి చికిత్సకు సిద్దమైన పవన్ కళ్యాణ్ !

కంటి చికిత్సకు సిద్దమైన పవన్ కళ్యాణ్ !

Published on Jun 22, 2018 1:06 PM IST

pawan kalyan

సినిమాలు పక్కనబెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగి ప్రజా క్షేత్రంలోనే గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా కంటి ఇన్ఫెక్షన్ తో ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే. దీని కారణంగా చాలా రోజులుగా ఆయన పలు కార్యక్రమాలకు నల్ల కళ్ళజోడుతోనే హాజరవుతున్నారు.

తాజా సమాచారం మేరకు ఇన్ఫెక్షన్ నివారణ కోసం ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్దమయ్యారని తెలిస్తోంది. ఈ నెల 24న హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ లో ఈ శస్త్ర చికిత్స జరగనుంది. ఆపరేషన్ అనంతరం పవన్ ఒక్క రోజు విశ్రాంతి తీసుకుని జూన్ 26 నుండి వైజాగ్లో జరుగనున్న బస్సు యాత్రను కొనసాగించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు