ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62 వ చిత్ర టైటిల్ , ఫస్ట్ లుక్ ను నిన్న అయన పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు . సర్కార్ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ ను చూసి అభిమానులు పండగ చేసుకుంటుంటే తమిళనాడు ఎం పి మాత్రం ఈ ఫస్ట్ లుక్ ఫై విమర్శలు చేశారు .దీనికి కారణం
ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో విజయ్ సిగరెట్ తాగుతూ కనిపించాడు ఈ పోస్టర్ చూసిన తమిళనాడు పార్లమెంటు సభ్యుడు అన్బుమణి రాందాస్ ట్విట్టర్ వేదికగా విజయ్ ని విమర్శించారు
సిగరెట్ లేకుండా ఉండి ఉంటే మీరు ఇంకా స్టైలిష్ గా ఉండేవారు పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం మరియు కాన్సర్ కు కారణం ,ధూమపానం ప్రాణాలు తీస్తుంది అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు అంతటితో ఆగకుండా గతంలో విజయ్ ఒక ఇంటర్వ్యూ లో తను నటించే సినిమాల్లో ధుమపానం చేయనని చెప్పారు . ఈ సందర్బంగా అన్బుమణి ఆ వార్తను కూడా పోస్ట్ చేశారు . ఇప్పుడు విజయ్ ఈ సర్కార్ చిత్రంలో ధుమపానాన్ని ప్రమోట్ చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని బాధ్యతగా వుండండి పొగతాగటాన్ని ప్రోత్సహించకండి అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు .
ఈ ధుమపానం విషయంలో ఇంతకుముందు రజినీకాంత్ కూడా విమర్శలు ఎదుర్కున్నారు . అయన నటించిన బాబా చిత్రంలో పొగతాగే సన్నివేశాలు ఉండడంతో రజినీ ఈ విషయంలో యువతను తప్పుదారి పట్టిస్తున్నారు అన్న విమర్శలు వచ్చాయి .


