స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కార్’. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు కూడ విశేషమైన స్పందన లభించింది. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తికాగా మిగిలి ఉన్న చిత్రీకరణ కోసం టీమ్ అమెరికా వెళ్లనుంది.
అక్కడే లాస్ వెగాస్ లో విజయ్ పై అతి ముఖ్యమైన ఇంట్రో సాంగ్ ను చిత్రీకరించనున్నారు. అభిమానుల దృష్ట్యా ఈ ఇంట్రో సాంగ్ చాలా ముఖ్యమైంది కావడంతో గొప్పగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విజయ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


