మహేష్ 25వ చిత్రం వేసవికి రానుందా ?

మహేష్ 25వ చిత్రం వేసవికి రానుందా ?

Published on Jun 27, 2018 2:47 PM IST

Mahesh Babu

భరత్ అనే నేను చిత్రం తో భారీ విజయాన్ని అందుకొని ప్రస్తుతం తన 25 వ చిత్రంలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఈ షెడ్యూల్ తరువాత అమెరికా, హైదరాబాద్ లో షూటింగ్ ను జరుపుకోనుంది ఈ చిత్రం. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుందనుకున్న ఈ చిత్రం ఆ సమయానికి చిత్రీకరణ పూర్తి చేసుకోలేకపోతే వేసవిలో విడుదలయ్యే సూచనలున్నాయట.

ఇక వేసవిలో విడుదలైన మహేష్ సినిమాలు దాదాపుగా అన్ని భారీ విజయాన్ని సొంతం చేసుకొన్నాయి. దాంతో దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ నెలలో ప్రేక్షకులముందుకు తీసుకరావడం మంచిదేనని భావిస్తున్నారట. పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు