కిస్ సీన్స్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్ !

కిస్ సీన్స్ కి భయపడుతున్న స్టార్ హీరోయిన్ !

Published on Jul 1, 2018 4:37 PM IST

keerthi suresh

‘మహానటి’ చిత్రంతో సావిత్రిగారి పాత్రలో అద్భుతంగా నటించి కేవలం తన హావభావాలతో అన్నివర్గాల ప్రేక్షకుల హృదయాలను కదిలించారు యువ కథానాయిక కీర్తి సురేష్. సావిత్రిగారి పాత్రను ఇంతకన్నా ఇంకెవ్వరూ భాగా చేయలేరేమో అన్నెంతగా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయారు. అయితే కీర్తి సురేష్ అందరి హీరోయిన్లలా కాకుండా మొదటినుంచి ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉన్న పాత్రల్నే ఎంచుకొని చేస్తున్నారు.

తాజాగా సినిమాల్లోని కిస్ కిస్ సీన్స్ గురించి కీర్తి సురేష్ స్పందిస్తూ.. నేనైతే ఎప్పటికీ కిస్ సీన్స్ లో నటించలేను, నాకు అలాంటి పాత్రలు గాని అలా నటించడం గాని అస్సలు ఇష్టం ఉండదు. నేను ఎలాంటి పరిస్థితులోనైనా కిస్ సీన్స్ లో నటించే ప్రసక్తే లేదు అని ఆమె కరాఖండిగా చెప్పారు. అయినప్పటికీ కీర్తి సురేష్ కు రోజురోజుకి అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క ‘మహానటి’ సినిమాతోనే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ మారిపోయింది.

తాజా వార్తలు