శశికిరణ్ దర్శకత్వంలో ఆడవి శేష్ హీరోగా రాబోతున్న చిత్రం ‘గూఢచారి’. ఆడవి శేష్ సరసన శోభిత హీరోయిన్ గా నటిస్తోంది. కాగా అక్కినేని సమంత ఈ ‘గూఢచారి’ చిత్రం టీజర్ ను విడుదల చేస్తూ ఈ చిత్రం టీజర్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లు ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. నా చేతుల మీదగా ‘ గూఢచారి’ టీజర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.
ఇంకా హీరో ఆడవి శేష్ గురించి మాట్లాడుతూ క్షణం చిత్రం లాగే ఈ చిత్రం కూడా ఆడవి శేష్ కి పెద్ద విజయం తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నేను కూడా అందరిలాగే ‘గూఢచారి’ కోసం ఎదురు చూస్తున్నా” అని సమంత చెప్పుకొచ్చారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపొందించారు.


