‘దేవదాస్’లు ఆరోజే రానున్నారు !

‘దేవదాస్’లు ఆరోజే రానున్నారు !

Published on Jul 11, 2018 10:20 PM IST

కింగ్ నాగార్జున మరియు సహజ నటుడు నాని నటిస్తున్న మల్టీ స్టాటర్ చిత్రం ‘దేవదాస్’. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ‘భలేమంచి రోజు’ చిత్రం తో దర్శకునిగా పరిచయమైన శ్రీ రామ్ ఆధిత్య తెరకెక్కిస్తున్న ఈచిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుందని సమాచారం.

ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్ర టైటిల్ పోస్టర్ సినిమా ఫై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈచిత్రంలో దేవ్ పాత్రలో నాగ్ నటిస్తుండగా దాస్ పాత్రలో నాని కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ పతాకం ఫై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ , రష్మిక మండన్నలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు