ఆపన్నులకు అండగా నిలుస్తున్న’మనంసైతం’ !

ఆపన్నులకు అండగా నిలుస్తున్న’మనంసైతం’ !

Published on Jul 12, 2018 2:39 PM IST

manam
ఆపన్నులకు అక్షయపాత్ర లా మరీనా స్వచ్చంద సంస్థ ‘మనం సైతం’ మరో పేదవాడికి అండగా నిలిచింది. డ్రైవర్స్ యూనియన్ లో పనిచేస్తున్న పి రాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్స కోసం 3 లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు చెప్పారు. రాజు దీన పరిస్థితిని తెలుసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ వెంటనే స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న’మనం సైతం’సేవా సంస్థ ద్వారా రూ. 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతటితో ఆగిపోకుండా ఆయన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ దృష్టికి రాజు పరిస్థితిని తీసుకెళ్లారు.

దానికి వెంటనే స్పందించిన తలసాని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 55 వేల రూపాయల సహాయాన్ని అందజేశారు. గురువారం ఈ చెక్ ను ఆయన సికింద్రాబాద్ మారేడుపల్లిలోని తన కార్యాలయంలో కాదంబరి చేతుల మీదుగా రాజుకు అందజేశారు. అనంతరం రాజు ‘మనం సైతం’ లాంటి గొప్ప సంస్థను నిర్వహిస్తున్న కాదంబరి కిరణ్ కుఅలాగే తన పరిస్థితి తెలుసుకొని హార్దిక సహాయం చేసిన మంత్రి తలసానికి కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు