‘నిహారిక, సుమంత్ అశ్విన్‌’ల హ్యాపి వెడ్డింగ్ నిలబడుతుందా ?

‘నిహారిక, సుమంత్ అశ్విన్‌’ల హ్యాపి వెడ్డింగ్ నిలబడుతుందా ?

Published on Jul 25, 2018 6:42 PM IST

Happy Wedding1
సుమంత్ అశ్విన్ హీరోగా మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించినప్పటికీ బాక్స్ అఫీస్ వద్ద ఈ చిత్రం ఎంతవరకు నిలబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ముఖ్యంగా ఈ చిత్రం కథాంశం పై ఒక్క తెలుగులోనే ఎన్నో చిత్రాలు వచ్చాయి. మరి ఈ చిత్రంలో కూడా అలాంటి అంశమే ఉందా ? లేక కొత్తగా ఏమైనా పాయింట్ ను టచ్ చేశారా అన్న దాని మీద ఈ చిత్రం ఫలితం ఆధారపడి ఉంది. అయితే సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముఖ్యంగా పెళ్ళి ప్రాముఖ్యతను వివరించనున్నారట. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని అందివ్వగా తమన్ నేపధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, పవిత్రా లోకేష్, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు