‘పడిపడి లేచె మనసు’లో అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ !

‘పడిపడి లేచె మనసు’లో అతిథి పాత్రలో స్టార్ హీరోయిన్ !

Published on Aug 10, 2018 11:22 PM IST

kajal3

‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ ఫెమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడిపడి లేచె మనసు’. ఇటీవల ఈ చిత్రం కలకత్తాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శర్వా ఈ చిత్రం తో పాటు ‘స్వామి రారా’ ఫెమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తుండడంతో ఈచిత్రం యొక్క ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను వాయిదా వేశారు. నేపాల్లో జరిగనున్న ఈచివరి షెడ్యూల్ తో ఈచిత్ర షూటింగ్ పూర్తికానుంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా ఫుట్ బాల్ ప్లేయర్ గా నటిస్తుండగా సాయి పల్లవి డాక్టర్ పాత్రలో కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ కాజల్ అతిథి పాత్రలో కనిపించనుందట. శ్రీలక్ష్మివెంకటేశ్వర సినిమాస్ పతాకం ఫై చెరుకూరిసుధాకర్ , చుక్కపల్లి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు