తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న’మారి 2′ చిత్ర షూటింగ్ నేటితో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2015లో ధనుష్ , కాజల్ జంటగా నటించిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది. ఈ చిత్రంలో ‘ఫిదా’ ఫెమ్ సాయి పల్లవి కథనాయికగా నటిస్తున్నారు. ఆమె ఈ సినిమాలో ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనుంది.
ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.


