ప్రముఖ దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్న చిత్రం మణికర్ణిక. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సోనూసూద్ సదాశివ్ అనే మరాఠి రాజు పాత్రలో నటిస్తున్నారు. దాదాపు ఆయన పాత్ర తాలూకు షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈలోగా ఏమైందో అనూహ్యంగా ఈచిత్రం నుండి ఆయన తప్పుకున్నారు.
అయితే కంగనాతో విభేదాల కారణంగానే సోను ఈ చిత్రం నుండి తప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. సెట్లో ఆయనను తక్కువ చేసి చూడడమే ఇందుకు కారణం గా తెలుస్తుంది. ఇక ఇటీవల డైరెక్టర్ క్రిష్ కూడా ఈచిత్రం నుండి తప్పుకున్నాడని దానికి కూడా కారణం కంగనానే అని దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె చేపట్టిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీ గా ఉండడం వల్ల కొన్నిసీన్లకు నేను డైరక్షన్ చేయాల్సివచ్చిందని కంగనా క్లారిటీ ఇచ్చారు.


