అఫీషియల్ : సల్మాన్ కోసం నయన్ ఎంట్రీ.. వంశీ పైడిపల్లి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

అఫీషియల్ : సల్మాన్ కోసం నయన్ ఎంట్రీ.. వంశీ పైడిపల్లి ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Published on Apr 1, 2026 12:59 AM IST

SalmanKhanVamshiPaidipallyF

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా అనౌన్స్ చేసి దర్శకుడు వంశీ పైడిపల్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతుండగా, తాజాగా ఈ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా ఖరారైంది. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి అందుతున్న తాజా సమాచారం ప్రకారం, సౌత్ ఇండియన్ స్టార్ నయనతార ఈ సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్‌గా నటించనుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్కమ్ నోట్ విడుదల చేసింది. ‘అద్భుతమైన నటనతో అలరించే నయనతార, సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి చిత్రంలో భాగం కావడం మాకు గర్వకారణం. ఈ స్పెషల్ ప్రాజెక్టులోకి ఆమెకు స్వాగతం’ అంటూ మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ షూటింగ్ ఏప్రిల్ 2026 నుండి ప్రారంభం కానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు