
మల్ల యోధుడి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ‘సుల్తాన్’. 2016లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 584కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక్కడ ఇంతలా కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం చైనాలో మాత్రం తేలిపోతుంది. తాజాగా ఆగస్టు 31న అక్కడ విడుదలైన ఈచిత్రం ఓపెనింగ్స్ కూడా రాబట్టుకోలేక పోయింది.
3రోజులకుగాను ఈ చిత్రం రూ.21.3కోట్ల వసూళ్లను మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక ఈ ఏడాది చైనా లో విడుదలైన భారతీయ చిత్రాలలో ఈతరహా తక్కువ ఓపెనింగ్స్ ను సాధించిన చిత్రం కూడా ఇదే. అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. ఇక ఇటీవల అక్కడ విడుదలైన ‘బాహుబలి, దంగల్’ చిత్రాలు అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించాయి.

