అఅఆ షూటింగ్ అప్ డేట్స్ !

అఅఆ షూటింగ్ అప్ డేట్స్ !

Published on Sep 5, 2018 5:50 PM IST

AmarAkbarAnthony

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ప్రస్తుతం ఈచిత్ర యూనిట్ యుఎస్ షెడ్యూల్ ముగించుకొని హైదరాబాద్ కు చేరుకుంది. ఈషెడ్యూల్లో సాంగ్స్ మరియు కొన్ని కామెడీ ,యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈనెల రెండవ వారంలో హైదరాబాద్లో జరిగే షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. పోస్ట్ ప్రోడుక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి అక్టోబర్ 5న ఈ చిత్రాన్నీ విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంతో గత కొంత కాలంగా తెలుగు తెరకు దూరమైన ప్రముఖ హీరోయిన్ ఇలియానా మళ్ళి రీఎంట్రీ ఇస్తుంది.

శ్రీను వైట్ల-రవితేజ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడం అలాగే ఇంతవరకు విజయం తప్పించి అపజయం ఎరుగని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో సినిమా ఫై భారీ అంచనాలే వున్నాయి. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు