‘క్షణం’ తరువాత అడివి శేష్ నటించిన చిత్రం’ గూఢచారి’. నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఫుల్ రన్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 11కోట్ల షేర్ ను రాబట్టింది. అడివి శేష్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. స్పై త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
ఇక ఈ చిత్రం ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లనురాబట్టుకుంది. శోభిత దూళిపాళ్ల కథానాయికగా నటించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సుప్రియ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లు సంయుక్తంగా నిర్మించాయి. ఈచిత్రంతో వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు అడివి శేష్. ఇక ఈసినిమాతో దర్శకుడు శశి కిరణ్ తన తదుపరి చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ లో చేసే ఛాన్స్ ను కొట్టేసాడు.


